CM of AP | తెలుగుజాతి గర్వకారణం ఎన్టీఆర్..
CM of AP | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : ఎన్టీఆర్ ఆశయాలను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీ రామారావుకు భారతరత్న పురస్కారం ఇవ్వాలన్నది ప్రజల ఆకాంక్ష అని పేర్కొన్నారు.
టీడీపీ మహానాడు వేదికగా ఎన్టీఆర్కు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు చంద్రబాబు వెల్లడించారు. దేశానికి, రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
చరిత్ర ఉన్నంతకాలం ఎన్టీఆర్ తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చంద్రబాబు అన్నారు. రాజకీయాలు, సినీరంగం, ప్రజాసేవలో ఆయన చూపిన మార్గం భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాల సాధనకే టీడీపీ కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.
