ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట భద్రత

బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేసిన.
కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్

కర్నూల్ ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జొన్నగిరి పర్యటన సందర్భంగా చేపట్టిన భద్రతా ఏర్పాట్లను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ వివరించారు. మంగళవారం పగిడిరాయి గ్రామ సమీపంలోని జొన్నగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్డ్ మైన్స్ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, రూట్ బందోబస్తు, సెక్టార్‌ల వారీగా నియమించిన ఇన్‌ఛార్జ్ అధికారుల విధులు, భద్రతా చర్యల గురించి జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సమగ్రంగా కర్నూలు రేంజ్ డిఐజి డాక్టర్ కోయ ప్రవీణ్ కి వివరించారు. ముఖ్యమంత్రి పర్యటన కోసం 1,200 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ సెక్టార్ ఇన్‌ఛార్జ్‌లు, పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. బందోబస్తు విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని, సమన్వయంతో విధులు నిర్వహించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.