అనారోగ్య బాధితులకు అండగా సీఎం సహాయనిది..

వైసీపీ ఐదేళ్లు ఒక్కరికి కూడా ముఖ్యమంత్రి సహాయనిది అందించలేదు
డీఎస్సీ పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తే..వైసీపీ నాయకుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారు..
ఇప్పటి వరకు డీఎస్సీలు నిర్వహించింది టీడీపీ ప్రభుత్వమే
మద్యం నుంచి వచ్చిన సొమ్మంత తాడేపల్లి ప్యాలెస్ కు తరలించాడు
తాగు, సాగు నీటి ఇబ్బందులకు గత వైసీపీ నాయకుల పాపమే
ఐదేళ్లు కళ్యాణదుర్గం వైపు చూడని రంగయ్య నేడు కుటిల రాజకీయాలు చేస్తున్నారు..
నాయకులకు, ప్రజలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం
మీడియా మిత్రులకు స్థలం కేటాయించి ప్రెస్ క్లబ్ ను నిర్మిస్తా
53 మంది బాధితులకు 33,16,801 రూపాయలు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే, నాయకులు
వింత వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు 50,000 రూపాయలు ఆర్ధిక సాయం అందజేసిన ఎమ్మెల్యే


కళ్యాణదుర్గం టౌన్, ఆగస్టు 8(ఆంధ్రప్రభ) : కళ్యాణదుర్గం ప్రాంతంలో ఎక్కువగా బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్నారని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ధరఖాస్తు చేసుకున్న ఏ ఒక్కటి కూడా వెనక్కి పంపకుండా ఎప్పటికప్పుడు నిధులు కేటాయించి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందిస్తున్నారని, గత ప్రభుత్వంలో ఒక్కరికి కూడా అందించిన పాపాన పోలేదని ఇది నిరంతరం కొనసాగుతుందని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు.. ఇవాళ ప్రజావేదిక నందు టీడీపీ సీనియర్ నాయకులు, మండల పార్టీ కన్వీనర్లు, మార్కెట్ యార్డు చైర్మన్, డైరెక్టర్లు, పార్టీ ముఖ్య నాయకుల సమక్షంలో 53మంది బాధితులకు రూ.33,16,801ల చెక్కులను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పంపిణీ చేశారు.

అందులో తక్కిలపాటి నగేష్ రూ.58,633లు, ఏ శంకరప్ప రూ.31,961 లు, బోయ అంజినమ్మ రూ.67,113 లు, టీ మహ్మద్ ఫజిల్ రూ.20,732 లు, కే లక్ష్మీదేవి రూ.35,000 లు, బీ దొనప్ప రూ.30,514 లు, జీ సాగర్ రూ.25,084లు, జీ చిక్కన్న డెత్ గొల్ల ఈరక్క రూ.63,961 లు, ఈరన్న రూ.20,000 లు, శీబాయి శ్రీనివాసులు రూ.25,000, తల్లపల్లి రామరత్న డెత్ తల్లపల్లి జయవీరయ్య రూ.44,227లు, మమతమ్మ రూ.40,350 లు, బుడబుక్కల మౌనిక రూ.46,625 లు, దాసరి దివ్య శ్రీ చైల్డ్ అఫ్ దాసరి మంజుల రూ.68,900లు, పీ శకుంతలమ్మ రూ.25,351లు, పూజారి ఈరన్న రూ.27,299లు, పెద్ద నాగప్ప గారి వీరేంద్ర రూ.67,038లు, గొల్ల సుమలత రూ.20,000లు, కొలిమి నుర్జాహన్ రూ.47,919లు, కుమ్మర తిప్పేస్వామి డెత్ కే లక్ష్మీదేవి రూ.68,961లు, మద్దిపాటి ధనలక్ష్మి రూ.47,884లు, మదలా చంద్రకళ రూ.27,114 లు, సీ అనురాధ రూ.20,000లు, మలిశెట్టి లక్ష్మీ రూ.25,574, గొల్ల హర్షవర్ధన్ చైల్డ్ జ్యోతి రూ.23,400లు, వర్లి చంద్రమోహన్ రూ.20,000 లు, టీ మహ్మద్ కాజీమ్ చైల్డ్ యాషిన్ రూ.20,500లు, కండ్ర వెంకటేషులు రూ.25,000లు, కురుబ ఆంజనేయులు రూ.55,000లు, తప్పయ్య గారి పార్వతి రూ.20,000లు, ఈ బాగ్యమ్మ రూ.30,028లు, బోయ రామలక్ష్మి రూ.30,028లు, అష్మా భాను రూ.35,914 లు, ఉప్పర బాగ్యమ్మ రూ.30,028లు, గొల్ల నాగభూషణ రూ.31,843లు, యర్రబెల్లి నాగరాజు రూ.29,300లు, ఎన్ వీ మంజుల రూ.23,400లు, ఎనుముల జాన్వీ చైల్డ్ శ్రావణి రూ.36,084 లు, బెరీలా విగ్నేష్ చైల్డ్ హరిజన మైలార జ్యోతి రూ.23,927లు, దూలం అంజినమ్మ రూ.41,143లు, కే జయశ్రీ రూ.23,920లు, కాకిమని తిమ్మప్ప రూ.32,551లు, ఎమ్ వినోద్ కుమార్ రూ.55,250 లు, నీలి సింగిరప్ప రూ.95,000 లు, తలారి కొండప్ప రూ.1,69,459లు, ఉదయప్ప గారి బొమ్మయ్య రూ.2,54,011లు, జగదీష్ రూ.1,50,819 లు, భీమన్న గారి కరియన్న రూ.1,94,877 లు, ఎల్ తేజస్విని రూ.2,58,896 లు, మేడా రామకృష్ణ డెత్ రామలక్ష్మి రూ.1,50,047 లు, వై రమేష్ రూ.1,70,848 లు, ఈడిగ రత్నాకర్ గౌడ్ రూ.1,55,550, గాజుల కరియప్ప రూ.1,74,738 ల చెక్కులను అందజేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడుతూ… అత్యంత పారదర్శకంగా ఎలాంటి వివాదాలు కానీ, కోర్టు కేసులు కానీ లేకుండా ఒకే సారి 16,500 మంది ఉపాధ్యాయ పోస్టులు అందిస్తే వైసీపీ సైకో జగన్ మాత్రం అసత్య ఆరోపణలు చేస్తూ ఎన్నో ఏళ్ళు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధిస్తే వారిని అవమానించే విధంగా అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని, రాజశేఖర్ రెడ్డి కానీ జగన్ కానీ ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన దాకలాలు లేవని ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్లు అన్ని కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చినవే అని తెలిపారు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీని స్థాపించి 43 ఏళ్ళు అయిన ఇంత పటిష్టంగా ఉందంటే అందుకు బడుగు, బలహీన వర్గాలు అండగా ఉండటం పార్టీని మరింత ఉన్నతంగా నడుపుతున్న తమ యువ నాయకుడు లోకేష్ బలోపేతం చేయడమే ముఖ్య కారణమని తెలిపారు.

ఉపాధ్యాయులను జగన్ మద్యం దుకాణాల వద్ద కాపలా ఉంచాడని, ఆ వచ్చిన డబ్బు మొత్తం తాడేపల్లి ప్యాలెస్ కు తరలించాడని, ప్రస్తుతం గ్రామాల్లోకి వెలుతుంటే అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని, తాగునీళ్లు మాత్రం అడుగుతున్నారని, డానికి కారణం 2019 నుంచి 2024 వరకు ఇక్కడ పనిచేసిన మంత్రి దోచుకోవడానికి సరిపోతే మరొకాయన అప్పటి ఎంపీ కళ్యాణదుర్గం వైపు కన్నెత్తి కూడా చూసిన పాపాన పోలేదన్నారు. యస్విత శ్రీ, జైశ్విక శ్రీ అనే చిన్నారులకు వింత వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకుని వైద్య ఖర్చులకు రూ.50,000ను ఎమ్మెల్యే అందజేశారు..