బోల్తా పడి 7 మంది మృతి..
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : హిమాచల్‌ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో శనివారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. చురా సబ్‌డివిజన్‌లోని చాలుంజ్ మలుపు వద్ద బస్సు అదుపుతప్పి కింద ఉన్న మరో రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటనలో బస్సు తలకిందులుగా పడటంతో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు.

చంబా నుంచి బైరాఘర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
