సరిపడా ఎరువులు సరఫరా చేయండి
కేంద్ర మంత్రిని కోరిన ఎంపీ
బిక్కనూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రాంతానికి చెందిన రైతులకు సరిపడే ఎరువులను సరపర చేయాలని తెలంగాణ రాష్ట్ర పార్లమెంటు సభ్యుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ మల్లు రవి జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ షట్కర్ కోరారు. ఈ మేరకు కేంద్ర రసాయన ఎరువుల శాఖామంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ను పార్లమెంట్ కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువమంది రైతులు పంటలు సాగు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. పంటలకు సరిపోయే ఎరువులను సకాలంలో అందించాలని సూచించారు. ఎందుకు కేంద్రమంత్రి స్పందిస్తూ ఎరువుల కొరత లేకుండా తగులు తీసుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన ఎరువులు యాప్ లో రైతులకు కావలసిన ఎరువులు బుక్ చేసుకోవాలని సూచించారు. ఇట్టి విషయంపై రైతులకు అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు.
