Delhi | ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవంలో ప్రధాని మోడీ..
విద్యార్థులకు ప్రతిష్ఠాత్మక స్వర్ణ పతకాలు ప్రదానం..
మరిన్ని ఆవిష్కరణలు రావాలని ఆకాంక్ష
Delhi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఐఐటీ ఢిల్లీ 57వ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను ప్రదానం చేశారు.
విద్యార్థులకు రాష్ట్రపతి స్వర్ణ పతకం, డైరెక్టర్ స్వర్ణ పతకం, శంకరదయాళ్ శర్మ స్వర్ణ పతకం వంటి అవార్డులను ప్రధాని అందజేశారు. అనంతరం గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఐఐటీ ఢిల్లీ నుంచి పట్టాలు అందుకుంటున్న విద్యార్థులను చూస్తుంటే గర్వంగా ఉందని అన్నారు.
దేశ అభివృద్ధిలో యువత, ముఖ్యంగా సాంకేతిక విద్యను అభ్యసించిన విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని మోదీ ఆకాంక్షించారు. ఐఐటీ ఢిల్లీలో కొత్త ఆవిష్కరణలు రూపుదిద్దుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత మంది మహిళా గ్రాడ్యుయేట్లు ఐఐటీ నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సాంకేతికత, పరిశోధన, ఆవిష్కరణల రంగాల్లో విద్యార్థులు తమ ప్రతిభను మరింతగా వినియోగించుకుని దేశ ప్రగతికి దోహదపడాలని ప్రధాని సూచించారు.
