పార్టీ బలోపేతానికి కృషి…

పార్టీ బలోపేతానికి కృషి…
రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి అంకితభావంతో పని చేస్తా
ప్రజాసేవ పరమావధిగా ముందుకెళ్తా
ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య
జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : జాతీయ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీ నూతన కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలవేసి ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో కలిసి జాతీయ పోలిట్ బ్యూరో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఎమ్మెల్యే తాతయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి అంకితభావంతో కృషి చేస్తానని అన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆనాడు స్థాపించిన మహనీయుడి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రజాసేవ పరమావధిగా పనిచేస్తానని ప్రతిజ్ఞ చేయటం జరిగిందన్నారు. నూతన కమిటీ తో కలిసి పార్టీ బలోపేతానికి ముందుకెళ్తానని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, సంక్షేమ పాలన, ప్రజా పాలన అందిస్తూ దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలిచే విధంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు.
