Chennur | ఆశవాహులతో మంత్రి వివేక్ అభిప్రాయా సేకరణ

Chennur | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది. గత కొద్దీ రోజుల క్రితం వెలువడిన రిజర్వేషన్లలో 18 వార్డులకు అర్థ శాతం మహిళలకే పెద్దపీఠం వేయడంతో పాటు మున్సిపల్ చేరపర్సన్ బీసీ మహిళకు కేటాయించడంతో ఈ ఎన్నికలు రాసావతంగా మారునున్నాయి. చెన్నూరు మున్సిపాల్టీ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురావేసేందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఈ రోజు ఉదయం నుంచే చెన్నూరు తన క్యాంప్ కార్యాలయంలో మకాం వేసి స్థానిక 18 వార్డుల్లోని పోటీ ఆశవాహుల నుంచి అభిప్రాయా సేకరణ చేపడుతున్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గత కొద్దిరోజులుగా మంత్రి పట్టణ వార్డుల్లో మార్నింగ్ వాక్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు అభివృద్ధి చేపట్టెందుకు కోట్లాది నిధులతో భూమి పూజలు, శంకస్థాపనలు చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు.

Leave a Reply