కొత్త షెడ్యూల్ ఇదే..

వచ్చేనెలలో ప్రారంభం కానున్న ఆసియా కప్ క్రికెట్‌కు సంబంధించి పూర్తిస్థాయి షెడ్యూల్ వచ్చేసింది. ఫైనల్‌తో సహా టోర్నమెంట్‌లో మొత్తం 19 మ్యాచ్‌లు జరగనున్నాయి. టీ20 ఫార్మాట్‌లో జరిగే టోర్నీలో 8 జట్లు పోటీపడుతున్నాయి. అయితే, ముందుగా నిర్ణయించిన టైమింగ్‌లో మార్పులు చేస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది.
వేసవి తీవ్రతదృష్ట్యా స్థానిక కాలమానం ప్రకారం 6.00 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌లను 30 నిమిషాలు ఆలస్యంగా, అంటే 6.30 గంటలకు ప్రారంభించనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్‌లు మొదలవుతాయి. యూఏఈలో సెప్టెంబర్‌లో పగటి ఉష్ణోగ్రతలు 40 సెంటీగ్రేడ్‌లను తాకుతాయి.
అందువల్ల బ్రాడ్‌కాస్టర్ల అభ్యర్థన మేరకు యూఏఈ క్రికెట్‌బోర్డు మ్యాచ్ సమయాల్లో మర్పులు చేసింది. అయితే, సెప్టెంబర్ 15న అబుదాబి జాయేద్ స్టేడియంలో యూఏఈ-ఒమన్ మధ్య మ్యాచ్ మాత్రం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవుతుంది.
సెప్టెంబర్ 9న అఫ్గాన్-హాంగ్‌కాంగ్ జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నమెంట్ మొదలవుతుంది. దుబాయ్ 11 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తుండగా, ఫైనల్‌తో సహా 8 మ్యాచ్‌లు అబుదాబిలో జరుగుతాయి. గ్రూప్-ఎలో ఇండియా, పాకిస్థాన్, యూఏఈ, ఒమన్ ఉండగా, గ్రూప్-బిలో బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, హాంకాంగ్ జట్లున్నాయి.
