గాంధీ పురం ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేయించాలి…

గాంధీ పురం ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేయించాలి…

పాయకాపురం, ఆంధ్రప్రభ : 61 డివిజన్ దేవినేని గాంధీ పురం నివాసముంటున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేయించి పట్టాల మంజూరు చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం శనివారం చేపట్టారు. గత 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారికి ఏ ప్రభుత్వం న్యాయం చేయట్లేదని ముఖ్య మంత్రులు, ఎమ్మెల్యేలు మారినప్పటికి ఈసమస్య మాత్రం పరిష్కారం కావట్లేదని సెంట్రల్ సిటీ సీపీఎం కార్యదర్శి భూపతి రమణారావు, సిటీ కార్యవర్గ సభ్యులు కె. దుర్గారావు అన్నారు.

సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ఈ ప్రాంత వాసులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలిని, వెంటనే పట్టాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చింతల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply