ఊరు వరదంతా అమ్మోరి గుడికే

ఊరు వరదంతా అమ్మోరి గుడికే

కోటబొమ్మాళి (శ్రీకాకుళం) ఆంధ్రప్రభ : అధికారులు పెద్దల ముందు చూపు లేని కారణంగా ఎంతో పవిత్రంగా భావించే కోటబొమ్మాళి (Kotabommali)లోని నీలమణి దుర్గమ్మ (పాతపట్నం అమ్మవారు) వరద నీట మునగాల్సిన దుస్థితి ఏర్పడింది. బుధ, గురువారాలు కురిసిన భారీ వర్షానికి అమ్మవారి గుడి చుట్టూ నీరు నిర్బంధించింది. గుడిలోకి(into the temple) వెళ్లాలంటే మోకాళ్ళ కంటే పైకే ఎత్తుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఎదురయింది.

గురువారం దసరా రోజు కావడంతో వాహన చోదకులు, మహిళలు భారీగా వెళ్లి అమ్మవారిని దర్శించుకోవలసి ఉండగా ఈ పరిస్థితి చూసి ఎవ్వరు వెళ్ళడానికి సాహసించలేకపోయారు. అమ్మవారి గుడి వరండా వరకు నీరు రావడంతో గుడికి పక్కనే ఉన్న అమ్మవారి అసలైన విగ్రహం(idol) నీట మునిగిపోయిందని అర్చకుడు సింహాద్రి తెలిపారు.

పక్కనే తాము నివాసం ఉంటున్న గుడిసె పూర్తిగా నీట మునిగిపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. గ్రామానికి చెందిన వరద నీరు వచ్చే కాలువ గుడి కంటే ముందు వరకు నిర్మించి విడిచిపెట్టడంతో వరద నీరు బయటకు పోయే మార్గం లేక దిగువనమన్నగుడిలోకి నేరుగా ప్రవహిస్తోంది. ఇప్పటికైనా అధికారులు(officials), ప్రజాప్రతినిధులు స్పందించి తగిన చర్యలు తీసుకోవలసిన ఆవశ్యకత ఉంది.

Leave a Reply