eye testing | 96 మందికి కంటి ప‌రీక్ష‌లు

eye testing | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : నారాయ‌ణ‌పేట లో ఈ రోజు సిటిజ‌న్ క్ల‌బ్ ఆవ‌ర‌ణ‌లో స‌క్షం స్వ‌చ్ఛంద సేవా సంస్థ‌, శంక‌ర కంటి ఆస్ప‌త్రి (హైద‌రాబాద్‌), పినిక్స్ ఫౌండేష‌న్ సంయుక్తంగా నిర్వ‌హించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో 96 మందికి కంటి ప‌రీక్ష‌లు రేశారు. నేత్ర శిబిరాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ జయచంద్రమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంధ‌త్వ రహిత సమాజ నిర్మాణం కోసం ప్ర‌తి ఒక్క‌రూ కృషి చేయాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో సంస్థ జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్ట‌ర్‌ మదన్ మోహన్ రెడ్డి, డాక్ట‌ర్ ప్రసాద్ శెట్టి, డాక్ట‌ర్ గగన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కె. రాఘవేంద్ర గౌడ్, రాజశేఖర్, రాజశేఖర్ గౌడ్, శంకర ఆస్పత్రి ప్రతినిధులు శివరంగ, పినిక్స్ ఫౌండేషన్ ప్రతినిధి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.