జిల్లా ఎస్పీ ప్రకటన..
తిరుపతి క్రైమ్, (ఆంధ్రప్రభ) : ప్రతి సోమవారం నిర్వహించే పి.జి.ఆర్.ఎస్ కార్యక్రమాన్ని ఈ సోమవారం రద్దు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతికి ప్రముఖుల రాక సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు
గమనించగలరని, అత్యవసర పరిస్థితుల్లో సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. అలాగే, ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎస్పీ కార్యాలయానికి రావద్దని ఆయన కోరారు.
