కుటుంబం కోసం వలస వెళితే..

కుటుంబం కోసం వలస వెళితే..
-తండ్రిని కోల్పోయి తల్లి పోషణకు వలస వెళ్లి విగత జీవిగా మారిన వైనం..
-విధి నిర్వహణలో యువకుడు మృతి.. వీధిన పడ్డ కుటుంబం..
ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : కుటుంబ పోషణ కోసం వలస వెళ్లి విగత జీవిగా మారిన యువకుడు, మృతుడు దారం వెంకటేష్ (26) మృతి ఘటన ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లా, సత్యవీడు మండలం, చెరివి గ్రామంలోని చోటుచేసుకుంది. మృతికి గల కారణాలిలా ఉన్నాయి. గత ఎనిమిదేళ్ల క్రితం తండ్రి సామ్యూల్ మృతి చెందడంతో, చెల్లి శ్రీలత, తల్లి రమాదేవిని పోషించుకునేందుకు గతంలో ఆర్సియం సంస్థ ఫాదర్ ఓర్లాండ్ ఆధ్వర్యంలో పూరిగుడిశను నిర్మాణం చేపట్టారు. కాలక్రమేణిగా రెండేళ్ల క్రితమే చిత్తూరు జిల్లా చేరివిలో ఓ ప్రైవేట్ విద్యుత్ సంస్థలో చేరి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో మార్చి16న చెరివి గ్రామంలో విద్యుత్ ఫోల్ పై ఎక్కి మరమ్మత్తులు చేస్తుండగా, ప్రక్కనున్న ఓవర్ లోడ్ లైన్ విద్యుత్ సరఫరా కావడంతో వైర్లకు తగలడంతో విద్యుత్ ఘాతానికి గురయ్యాడు.
ఘటన జరిగిన వెంటనే సత్యవీడు వైద్యశాలకు తరలించి, చికిత్స చేసినప్పటికీ, వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. నిరుపేద కుటుంబానికి తండ్రి పెద్ద దిక్కును, కొడుకును కోల్పోవడంతో, ఆ తల్లి కుటుంబానికి కొంత ఆర్థిక సహకారం అందించాలనే లక్ష్యంతో మధ్యగల దళారి సమక్షంలో విద్యుత్ అధికారులతో ఆళ్లపల్లి మండలం గ్రామ పెద్దలు, గాడుదుల బాబు, గంగిశెట్టి చలబందిరాజు, పరమ ఇమ్మానియేల్, స్వామిదాస్ కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరిపారు. మృతుడు కుటుంబానికి కొంత ఆర్థికంగా మేలు జరగడంతో 18 బుధవారం ఆళ్లపల్లి మండలంలోని అంత్యక్రియలు చేశారు.
