ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పాకెట్లు పంపిణీ

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : ఉపాధి హామీ కూలీలకు ప్రపంచ కార్మిక (మేడే) సందర్భంగా సర్పంచ్ దుమాల మమత (రాజు)మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.శుక్రవారం నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలలోని చేంగల్ గ్రామంలో మేడే సందర్భంగా ఉపాధి హామీ పనులు పరిశీలించి ఎండ తీవ్రతతో జాగ్రత్త పాటించాలంటూ ఉపాధి హామీ కూలీలకు సర్పంచ్ మమత (రాజు)వారి సొంత ఖర్చులతో మజ్జిగ పాకెట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని మేడే సందర్భంగా జాతీయ ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పాకెట్లు పంపిణీ చేస్తూ ఉపాధి హామీ పనులను ఉదయం వేళ తొందరగా వస్తూ పనులు చేసుకోవాలని సూచించారు.
రైతులు వ్యవసాయ పొలాల్లో చేపట్టే వివిధ పనులు సకాలంలో పూర్తి చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం కొలతల ప్రకారం కూలీలకు డబ్బులు చెల్లిస్తుందని కూలీలు కలసికట్టుగా పనులు చేసుకుంటే గిట్టుబాటు కూలివస్తుందన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని పని ప్రదేశంలో కూలీలకు వసతులు అన్ని విధాలుగా కల్పిస్తున్నామని అన్నారు. కూలీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాతి మోహన్ గౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రతీప్, పాలకవర్గం సభ్యులు,గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
