వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోండి: సర్పంచులు

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : వరి ధాన్యం కొనుగోలు కేంధ్రలను వరిధాన్యం రైతులందరు సద్వినియోగం చేసుకోవాలని ఖండేబల్లూర్ గ్రామ సర్పంచ్ చాకలికృష్ణ,కౌలాస్ గ్రామ సర్పంచ్ ఎంబరి విద్యబలరాం అన్నారు.జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఆదేశానుసారం ఐకేపీ ఆధ్వర్యంలో గురువారం నాడు ఖండేబల్లుర్, కౌలాస్ గ్రామాల్లో వ్యవసాయ శాఖఅధికారి మహేశ్వరి,ఐకెపి ఎపిఎం వందేమాతరం, కాంగ్రెస్ ముఖ్య నాయకులలతో కలిసి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ప్రభుత్వం వరిధాన్యం ఏ గ్రేడ్ కు క్వంటలుకు 2389 రూపాయలు,సాధారణ వరిధాన్యం రకానికి 2369 మద్దతు ధర కల్పించడం జరిగిందని,వరిధాన్యం రైతులు తమ ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలన్నారు.రైతులు నియమ నిబంధనలను అనుసరించి తగిన ధ్రువపత్రాలు సమర్పించి ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ సందర్భంగా మహిళ సంఘం అధ్యక్షురాలు భూమావ్వతో పాటు ఇరు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
