ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు

కాచాపూర్‌లో జెండా ఆవిష్కరణ
బిక్కనూర్ ఎప్రిల్ 27 ఆంధ్రప్రభ… మండలంలోని కాచాపూర్ గ్రామంలో సోమవారం బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షులు అబ్బా బాలకిషన్ గులాబీ జెండాను ఆవిష్కరించారు అనంతరం మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు అనుకూలంగా నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ తెలంగాణ దశను, దిశను మార్చేది బిఆర్ఎస్. పార్టేనని, కేసిఆర్ పోరాట పటిమతో, అమరవీరుల ఆత్మబలిదానంతో సాదించుకున్న తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కేసిఆరుదేనని కొనియాడారు. కేసిఆర్ తెలంగాణ ను అభివృద్ది పరంగా భారతదేశంలో ప్రథమస్థానంలో నిలిపితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను మళ్ళీ కరువుకాటకాలు, విద్యుత్ కోతలు, హైడ్రా కూల్చివేతలు, రైతుల ఆత్మహత్యలతో తెలంగాణగాను అదోగతి పాలు చేసే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ ను దుయ్యబట్టారు. రాబోయే రెండున్నర ఏళ్లలో మళ్ళీ . పార్టే అధికారంలోకి వస్తుందని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను గౌరవించి తెలంగాణ ను బంగారు తెలంగాణ గా మార్చే విధంగా కేసిఆర్ నూతన ఉత్సాహంతో కదులుతున్నారని అన్నారు.
కార్యక్రమంలో నాయకులు భూమని సిద్దరాంములు, వార్డు సభ్యురాల్లు సంగెపు మమత, కొండమడుగు లావణ్య, పుల్లేప్యాక శ్యామల, మాజీ ఉపసర్పంచ్ సాయబుగారి సిద్దాగౌడ్, కామినేని రాజిరెడ్డి, కామినేని జీవన్ రెడ్డి, ఆకుతోట రాములు, ఆకుతోట దేవయ్య, మైదంపల్లి లోహిత్ రావు, బురిగారి ఎల్లయ్య, కొండమడుగు భూమయ్య, కామిండ్ల సత్యం, పూస నర్సింలు, డి. శ్రీనివాస్, సంగెపు మల్లేశం, సంగెపు రాజు, వడ్ల మహెందర్, ఊడెం మల్లారెడ్డి,, బురెంగారి బాలెల్లు , షేక్ లతీఫ్, కొండమడుగు రాజేందర్, నీలం స్వామి, బండారి సాయి క్రిష్ణ, బండారి హరీష్, జోగు శివరాజు, బురిగారిసురేష్,ముదాంరాకేష్ ,బూరు ఎల్లంగౌడ్, శేర్ల రాములు, మర్రి రాజయ్య , ఊడెం పవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
