BRS Vs Congress l నాడు ఓటమి.. నేడు పోరులో..
BRS Vs Congress l నాడు ఓటమి.. నేడు పోరులో..
BRS Vs Congress మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన పలువురు.. ప్రస్తుతం కౌన్సిలర్ పదవి కోసం పోటీలో ఉన్నారు. ఈ సారి తమకు సెంటిమెంట్ పని చేస్తుందని, సానుభూతి పవనాలు వీస్తాయన్న ఆశతో బరిలోకి దిగి ప్రచార పర్వంలో తమదైన శైలిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. 2వ వార్డులో కూర్మిళ్ల ప్రమీల రాములు గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయగా, ప్రస్తుతం కాంగ్రెస్ తరపున పోటీలో ఉన్నారు.

5 వ వార్డులో గతంలో కాంగ్రెసు తరపున పోటీ చేసిన మలిపెద్ది రజిత రాంరెడ్డి ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా, అదే వార్డులో గతంలో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన మొగుల్లపల్లి అనురాధ ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా, 9 వ వార్డులో గతంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మన్నే భీమయ్య ప్రస్తుతం బీఆర్ఎస్ తరపున, అదే వార్డులో గతంలో బీజేపీ తరపున పోటీ చేసిన మరాఠీ విజయలక్ష్మి ప్రస్తుతం అదే బీజేపీ పార్టీ నుండి పోటీలో ఉన్నారు. 11 వ వార్డులో గతంలో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన పసల విజయ మరియన్నలు ప్రస్తుతం అదే బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నారు.
12 వ వార్డులో గతంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మెంట నగేష్ రమణ ప్రస్తుతం అదే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. ఈ దఫా తమకు సానుభూతి పవనాలు వీచి, కౌన్సిలర్ గా గెలుపొందుతాం అన్న ధీమాలో పలువురు అభ్యర్థులు ఆశతో ఉన్నారు. మొత్తం 7 గురు అభ్యర్థులు గతంలో ఓటమి పాలై.. ప్రస్తుతం పోరులో నిలిచి తమ సత్తా చూపించనున్నారు.

