BRS | భారీగా బీఆర్ ఎస్‌లో చేరికలు…
BRS | పెద్దమందడి, ఆంధ్రప్రభ : ఖిల్లా ఘనపురం మండలం కోతులకుంట తాండ మాజీ సర్పంచ్ శ్రీను నాయక్(Srinu Nayak) ఆధ్వర్యములో మాజీ ఉపసర్పంచ్ పాండు నాయక్ ఆయన సతీమణి చంద్రమ్మ తన అనుచరులు 30మందితో నిరంజన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీ.ఆర్.ఎస్ పార్టీలో చేరారు.
వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించి, నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. గతములో జరిగిన అభివృద్దే మళ్లీ జరగాలని నన్ను నమ్మి పార్టీలో చేరిన మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మాజీ ఉప సర్పంచ్ పాండు నాయక్ మాట్లాడుతూ.. నిరంజన్ రెడ్డి మా తాండాను చాలా అభివృద్ధి చేశారని, రెండేండ్ల కాంగ్రెస్ పాలన(two years of Congress rule)లో అభివృద్ధి కుంటుపడిందని మా తాండా అభివృద్ధి కోసం నిరంజన్ రెడ్డి నాయకత్వం మాకు కావాలని నమ్మి కాంగ్రెస్ పార్టీ నుండి బీ.ఆర్.ఎస్ పార్టీలో చేరుతున్నాం అని అన్నారు.
పార్టీలో చేరిన వారిలో రఘు నాయక్, రాములు నాయక్, రెడ్డి నాయక్, శంకర్ నాయక్, కిషన్ నాయక్, టింగ్య నాయక్, మల్లేష్, శ్రీను నాయక్, మోహన్ నాయక్, లక్మన్ నాయక్, శివ నాయక్, హాతీరామ్ము నాయక్, భీంస నాయక్, సంతోష్, వాచ్య నాయక్, లోక్యా నాయక్, మొత్తం 50మంది చేరారు. ఈ కార్యక్రమంలో నందిమల్ల, అశోక్ జాతృ నాయక్, జోహెబ్ హుస్సేన్, సునీల్ వాల్మీకి, చిట్యాల రాము ఉన్నారు.

