వరంగల్ సభకు తరలిన బిఆర్ఎస్ నేతలు..

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బుధవారం వరంగల్ లో నిర్వహించే రైతు సంగ్రామ సదస్సుకు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తరలివెళ్లారు. రఘునాథపల్లి మండలకేంద్రంలో మాజీ జడ్పీటీసీ బొల్లం అజయ్(మణికంఠ), మాజీ ఎంపీపీ వై. కుమార్ గౌడ్, జనగామ వ్యవసాయ మార్కెట్ మాజీ వైస్ చైర్మన్, బిఆర్ఎస్ మండల కోఆర్డినేటర్ ముసిపట్ల విజయ్ ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివెళ్లారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయాన్ని పండుగలా చేసి, పంటలకు గిట్టుబాటు ధర అందిస్తే నేటి కాంగ్రెస్ పాలనలో రైతుల పంటలను కొనేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు దుబ్బాక హరీష్ గౌడ్, జిల్లా నాయకులు శెట్టి మాధవరావు, గూడ కిరణ్, మార్కాల మహేందర్ రెడ్డి, రఘునాథపల్లి ఉప సర్పంచ్ ద్యావరా యాకయ్య, వెల్ది ఉప సర్పంచ్ ఎడ్ల బాలరాజు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.