స్వరాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీ బిఆర్ఎస్

తెలంగాణ అస్తిత్వానికి ప్రతిక గులాబీ జెండా
మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
ఘనంగా బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
మక్తల్ , ఏప్రిల్ 27 (ఆంధ్రప్రభ) : తెలంగాణ ప్రజల చిరకల ఆకాంక్ష స్వరాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చిన గొప్ప పార్టీ బిఆర్ఎస్ అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. సుదీర్ఘంగి అలుపెరుగని పోరాటం ద్వారా తీసుకువచ్చి తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన గులాబీ జెండా నాలుగున్నర కోట్ల ప్రజల ప్రతీకగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయన పార్టీ నాయకులతో కలిసి గులాబీ జెండా ఎగరవేసి బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ అలుపెరుగని పోరాటంతో స్వరాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ బిఆర్ఎస్ అన్నారు. అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన జెండా గులాబీ జెండా అని ఆయన పేర్కొన్నారు .ఏప్రిల్ 27 తెలంగాణ ఆత్మగౌరవ ప్రత్యేకంగా గులాబీ జెండా ఎగరవేసిన చారిత్రాత్మక రోజు అని ఆయన పేర్కొన్నారు .త్యాగాల పునాదులపై పుట్టిన బిఆర్ఎస్ సబ్బండ వర్గాల ఆకాంక్షలను నెరవేరుస్తూ అభివృద్ధిలో సంక్షేమంలో దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు .పదేళ్ల పాలనలో అద్భుతమైన ప్రగతి ఫలాలను అందించిన పార్టీ దేశంలో ఏదైనా ఉంది అంటే అది బిఆర్ఎస్ మాత్రమేనన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించిన యోధుడు కేసీఆర్ అని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ పోరాటమే లేకపోతే తెలంగాణ ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు .ఈ ప్రాంత ప్రజల అస్తిత్వాన్ని కాపాడేందుకు ఆంధ్ర పాలకుల పెత్తనం తొలగించేందుకు చావు అంచుల దాకా వెళ్ళిన యోధుడు కేసీఆర్ అన్నారు .తెలంగాణ రాష్ట్ర అస్తిత్వానికి ప్రతిక బిఆర్ఎస్ పార్టీ అని మాజీ ఎమ్మెల్యే చిట్టెం అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనమే ధ్యేయంగా ఏర్పాటు అయిన పార్టీ ప్రజాస్వామ్యపద్ధతిలో పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన అనంతరము పదేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి చేసిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీ పాలన నిదర్శనం అన్నారు. అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలంటే తిరిగి పార్టీ అధికారంలో రావాల్సిన అవసరం ఉందని అందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంది అన్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను అన్నిటిని గ్రామీణ స్థాయిలోని ప్రజలకు తెలియజేశాల్సిన అవసరం ఉందన్నారు .రైతులు పడుతున్న ఇబ్బందులు మహిళలు సమస్యల పట్ల ప్రజలకు ఎప్పటికప్పుడు ప్రతి కర్త కార్యకర్త తెలియజేయాలని సూచించారు. భవిష్యత్తులో పార్టీ ఏ ఆదేశం ఇస్తే దానికి కట్టుబడి పని చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. తద్వారా రాష్ట్రంలో తిరిగి కెసిఆర్ ప్రభుత్వం రావడం ఖాయమని ఆయన అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తిరిగి కెసిఆర్ ప్రభుత్వమే రావడం ఖాయం అనే ఆలోచనలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారని వారందరి ఆలోచన మేరకు ప్రతి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నడుచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.
అనంతరం మండలంలోని గుడిగండ్ల గ్రామం వద్ద పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి. నరసింహ గౌడ్ ,బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చిన్న హన్మంతు , బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్తా, రాజుల ఆశిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి ,నాయకులు అన్వర్ హుస్సేన్, జగ్గలి రాములు, ఎరకాలి మొగిలిలప్ప ,గుర్లపల్లి సర్పంచ్ గాలి రెడ్డి ,మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, గుర్లపల్లి నరసింహారెడ్డి, జుట్ల శంకర్, మనాన్, తిరుమలాపూర్ కృష్ణ, జుట్ల సాగర్, నేతాజీ రెడ్డి, ఈశ్వర్ యాదవ్, మామిళ్ళ అమ్రేష్,ఉప్పరి రఘు, మారెప్ప, అభిరామ్ గౌడ్, అజ్గర్ అలీ, మహిముద్దుసాదిక్, కే.ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. గుడిగండ్ల బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ రాము, బోయ తిరుపతయ్య, వెంకటేశ్వర్ రెడ్డి, తిమ్మయ్య, కురుమయ్య, కిష్టప్ప, హనుమంతు, లింగం గౌడ్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆ గ్రామానికి చెందిన బిజెపికి చెందిన పదిమంది కార్యకర్తలు బిఆర్ఎస్ లో చేరారు .వారికి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

