బోథ్‌లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజలు

బోథ్‌లో పలు అభివృద్ధి పనులకు భూమి పూజలు

– ఎమ్మెల్యే అనిల్ జాదవ్

ఇచ్చోడ, ఆంధ్రప్రభ:
బోథ్ మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం భూమి పూజ చేశారు. కుచిర్యాల్ గ్రామంలో నాగపూర్ R&B రోడ్డు నుంచి నాగాపూర్ వరకు వయా మందబొగడ మార్గంలో సుమారు రూ.2 కోట్ల వ్యయంతో బీటీ రహదారి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ పనుల్లో సీడీ వర్కులు, సీసీ రోడ్డు నిర్మాణాలు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు.

అదేవిధంగా కొండ నుండి తేజపూర్ వరకు మరో రూ.2 కోట్ల వ్యయంతో బీటీ రహదారి నిర్మాణ పనులకు కూడా ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రహదారుల నిర్మాణం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కుచిర్యాల్, మందబొగడ, నాగాపూర్ గ్రామాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా మెరుగైన రహదారి కోసం ఎదురుచూస్తున్నారని, ఎట్టకేలకు ఆ సమస్య పరిష్కారమవుతోందని తెలిపారు.

అభివృద్ధి పనుల్లో నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. “పట్టుబడితే వదిలేది లేదు, ప్రజల కోసం అభివృద్ధిని సాధించి చూపుతాం” అని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply