BJP Candidate | నాగారంలో బీజేపీ అభ్యర్థి ముమ్మర ప్రచారం

BJP Candidate | నాగారంలో బీజేపీ అభ్యర్థి ముమ్మర ప్రచారం

BJP Candidate | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలం నాగారం గ్రామ సర్పంచ్ బీజేపీ అభ్యర్థి మాచబోయిన రవళి క్రాంతి కుమార్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ బలపర్చిన అభ్యర్థి మాచబోయిన రవళి క్రాంతికుమార్ నాగారం గ్రామ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు.

ఇవాళ‌ సర్పంచ్ అభ్యర్థి మాచబోయిన రవళి క్రాంతి కుమార్ గ్రామస్తులతో కలిసి వాడవాడలా తిరుగుతూ తనకు కేటాయించిన ఫుట్ బాల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. బీజేపీ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇస్తున్నారు. గ్రామంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేసి ఉత్తమ గ్రామ పంచాయతీగా నాగారం గ్రామాన్ని తీర్చిదిద్దుతానని చెబుతున్నారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని భరోసా కల్పిస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.

Leave a Reply