Bikkanoor | ఘనంగా వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం

Bikkanoor | బిక్కనూర్, ఆంధ్రప్రభ : వాసవి మాత తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని బికానూర్ సిద్ధి రామేశ్వర ఆర్యవైశ్య సేవా సంఘం నిత్య అన్నదాన సత్రం కోశాధికారి చికోటి వెంకటేశం అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని నిత్య అన్నదాన సత్రంలోని వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా భక్తులు, పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం మహిళలు ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున కుంకుమ పూజలు చేశారు. వాసవి మాత ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.
అనంతరం వెంకటేశం మాట్లాడుతూ.. ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. పూజల అనంతరం అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరిగిందని చెప్పారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు సభ్యులు మహిళలు పాల్గొన్నారు.
