Bichkunda | మహిళల సామాజిక ఆర్థిక అభివృద్దే కాంగ్రెస్ ధ్యేయం

Bichkunda | మహిళల సామాజిక ఆర్థిక అభివృద్దే కాంగ్రెస్ ధ్యేయం
- జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
Bichkunda | బిచ్కుంద, ఆంధ్రప్రభ : మహిళల సామాజిక ఆర్థిక అభివృద్దే కాంగ్రెస్ ధ్యేయం అని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. బిచ్కుంద మున్సిపాలిటీలోని కందరపల్లిలో స్వయం సహాయక మహిళా సంఘం సభ్యులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలకు ప్రతి పథకంలో మహిళల పేరు మీదనే మంజూరు చేస్తున్న ఘనత ప్రభుత్వాన్ని దేనిని ఆయన అన్నారు. నాడు స్వర్గీయ ఇందిరాగాంధీ రోటి కపడా మఖాన్ అనే నినాదంతో నిరుపేదలకు ఇల్లు మంజూరు చేసిన ఘనత ఇందిరమ్మదేనని ఆయన పేర్కొన్నారు.

అదే తరహాలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంటు, ప్రభుత్వం అందిస్తుందని ఆయన వివరించారు. బిచ్కుంద మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి సుమారు 15 కోట్ల వరకు అభివృద్ధి పనులు నిధులు మంజూరు చేస్తూ అదే విధంగా త్వరలోనే మెడికల్ కాలేజీ, వంద పడకల ఆసుపత్రి మౌలిక సదుపాయాలను బిచ్కుంద మున్సిపాలిటీను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం అని ఆయన అన్నారు. రాష్ట్రంలోనే బిచ్కుందను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతానని ఆయన అన్నారు. బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, వందేళ్ల వరకు ఎటువంటి త్రాగునీటి సమస్య రాకుండా ప్రణాళికలు సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు. బిచ్కుంద మున్సిపాలిటీగా ఏర్పాటు కోసం ఎంతో కష్టపడి తేవడం జరిగిందని ఆయన వివరించారు.
- మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి……… సబ్ కలెక్టర్ కిరణ్మయి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో ప్రాధాన్యత ఇస్తూ పథకాలు మంజూరు చేస్తుందని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. ప్రభుత్వం పథకాలు మహిళలకే మంజూరు చేస్తుందని వాటినే సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు.
చీరల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మార్వో వేణు, ఎంపీడీవో గోపాలకృష్ణ, పీసీసీ డెలిగేట్ విట్టల్ రెడ్డి, వాజిద్ నగర్ సర్పంచ్ గోపాల్ రెడ్డి, స్వయం సహాయక సంఘాలు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
