ముస్లిం సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

ముస్లిం సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

– ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

భూపాలపల్లి, ఆంధ్రప్రభ : బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గురువారం భూపాలపల్లి కేంద్రంలోని ఈద్గాహ్‌లో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముస్లిం సోదరుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. షాదీ ఖానాలు, ఈద్గాహ్‌ల అభివృద్ధితో పాటు వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ముస్లిం సోదర సోదరీమణులను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమురయ్య గౌడ్, కోఆప్షన్ సభ్యులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, ముస్లిం పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply