సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
సంగారెడ్డి, ఆంధ్రప్రభ: సంగారెడ్డి పట్టణంలోని 33వ వార్డులో డ్వాక్రా గ్రూప్ మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కౌన్సిలర్ రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని చీరలను స్వీకరించారు.కౌన్సిలర్ రవీందర్ నాయక్ మాట్లాడుతూ, మహిళల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హురాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళా సంఘాల సభ్యులు, డ్వాక్రా గ్రూప్ మహిళలు పాల్గొన్నారు.
