Telangana | రైతులకు మెరుగైన సేవలు…

Telangana | రైతులకు మెరుగైన సేవలు…

Telangana | బిక్కనూర్, ఆంధ్రప్రభ : సహకార సంఘాల (cooperative societies) ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామ సొసైటీ అధ్యక్షులు రాజా గౌడ్ (Raja Goud) అన్నారు. శుక్రవారం గ్రామంలో గల సొసైటీ ఆవరణంలో సహకార వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సహకార జెండాను ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ… రైతులకు కావలసిన ఎరువులు విత్తనాలు సొసైటీ (Society) ద్వారా సకాలంలో అందించడం జరుగుతుందన్నారు. రైతుల (farmers) సంక్షేమానికి నిరంతరం కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. మండల కేంద్రంతో పాటు అంతంపల్లి, తిప్పాపూర్, రామేశ్వర్ పల్లి, బస్వాపూర్, జంగంపల్లి గ్రామాలలో సహకార వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా సొసైటీల కార్యనిర్వాహన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, పాలకవర్గ సభ్యులు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply