Telangana | క్లీన్ చిట్ ఇచ్చిన స్పీక‌ర్

Telangana | క్లీన్ చిట్ ఇచ్చిన స్పీక‌ర్

Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన తీర్పు వెల్లడించారు. రాజకీయ ఉత్కంఠకు తెరదించుతూ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు క్లీన్ చిట్ ఇచ్చారు.

ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలు పార్టీ మారారు అనడానికి సరైన ఆధారాలు లేవని స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న 10మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇంతటితో స్పీకర్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుకు తెరపడింది.

కాగా, పార్టీ ఫిరాయింపుల కేసులో ఇప్పటికే ఈ కేసులో ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రేపటి వరకు ఫిరాయింపు కేసులో ఏదో ఒకటి తేల్చాలని గతంలో సుప్రీంకోర్టు గడువు విధించింది. సుప్రీంకోర్టు డెడ్ లైన్ నేపథ్యంలో ఇవాళ‌ స్పీకర్ ఈ తీర్పును వెల్లడించారు.

Leave a Reply