భక్తుల కోసం సొంత ఖర్చులతో బోరు ఏర్పాటు..

బాసర, ఆంధ్రప్రభ: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న కర్రోళ భోజన్న తన ఉదారతను చాటుకున్నారు. వేసవి కాలంలో ఎండల తీవ్రత పెరగడంతో ఆలయానికి వచ్చే భక్తులు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న విషయం గమనించి ఆయన ముందుకు వచ్చారు.

తన కీర్తిశేషులైన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆలయానికి చెందిన స్థలంలో సొంత ఖర్చులతో బోరు వేయించారు. ఇటీవల బోరు పనులు పూర్తికాగా, సోమవారం మోటారు బిగించి నీటి సరఫరాను ప్రారంభించారు.

దీంతో ఆలయానికి వచ్చే భక్తులకు తాగునీటి సౌకర్యం మరింత మెరుగుపడనుంది. అలాగే ఆలయ సిబ్బందికి కూడా ఈ నీటి వసతి ఉపయోగపడనుంది. భక్తుల అవసరాలను గుర్తించి సొంతంగా ముందుకొచ్చిన కర్రోళ భోజన్న సేవా భావాన్ని ఆలయ సిబ్బంది అభినందించారు.

Leave a Reply