పంట దగ్ధమైన రైతు కుటుంబాలకు పరామర్శ

కుంటాల, ఆంధ్రప్రభ : ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు అగ్నిప్రమాదంలో కాలిపోవడంతో నష్టపోయిన రైతు కుటుంబాలను బీజేపీ ముధోల్ నియోజకవర్గ సీనియర్ నాయకుడు, ప్రజా ట్రస్ట్ సభ్యుడు బోస్లే మోహన్‌రావు పటేల్ పరామర్శించారు. శుక్రవారం కుంటాల మండలం విట్టాపూర్ గ్రామంలో ఆయన పర్యటించి బాధితులను ఓదార్చారు.
ఈ సందర్భంగా రైతులు కట్ట రాజశేఖరరెడ్డి, కామెండ్ల గంగయ్య, గుజ్జారోళ్ల సురేష్ తదితరుల పంటలు విద్యుత్ తీగలు కిందపడటంతో అగ్నికి ఆహుతయ్యాయని తెలిపారు. మొక్కజొన్న, జొన్న పంటలు పూర్తిగా దగ్ధమై తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు.
బాధిత రైతులకు అండగా ఉంటామని, అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని బోస్లే మోహన్‌రావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిందే లింగారం పటేల్, మాజీ సర్పంచ్ గల్లపురం లక్ష్మీ రమేష్, గుద్దేటి నర్సయ్య, సౌదరి లక్ష్మణ్ పటేల్, ఆలూరు లింగారెడ్డి, సిహెచ్ రవి తదితరులు పాల్గొన్నారు.
