జుక్కల్ కాంగ్రెస్ మండల అధ్యక్షునిగా కులకర్ణి రమేష్ దేశాయ్

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేంరాజ్ కల్లాలి గ్రామస్తుడు కులకర్ణి రమేష్ దేశాయ్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, జిల్లా కాంగ్రెస్ కమిటీ నియామక పత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా కులకర్ణి రమేష్ దేశాయ్ మాట్లాడుతూ తమపై ప్రగాఢ విశ్వాసం,నమ్మకంతో మండల కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావుకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే కాకుండా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను అర్హులకు అందే విధంగా కృషి చేయటం జరుగుతుందని,అంతే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపథకాలన్నీ ఇంటింటికి చేర్చడం జరుగుతుందన్నారు.కాంగ్రెస్ శ్రేణులు,యువజన నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని ముందుకు సాగటం జరుగుతుందన్నారు.