ఘనంగా బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

గట్టుప్పల, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మండల వ్యాప్తంగా మంగళవారం ఘనంగా జరుపుకున్నారు.మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నామని జగన్నాథం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణంలో వారు చేసిన కృషి అపారమని,సామాజిక న్యాయం, సమాన హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు.

తహశీల్దార్ కార్యాలయంలో తాహశీల్దార్ రాములు,ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో వసంతలక్ష్మి,పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ సంజీవ రెడ్డి గట్టుప్పల గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ నామని జగన్నాథం, తేరటుపల్లి లో సింగం వెంకటేశం, వెల్మకన్నెలో రావుల స్వప్న రమేష్,నామపురం భీమనపల్లి రామయ్య,కమ్మగూడెంలో మెరుగు సాలమ్మ,అంతంపేటలో చందా శ్రీలత వెంకటేశం,శేర్ గూడెం పంకర్ల ప్రభాకర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డిసిసి ఉపాధ్యక్షులు దండు యాదగిరి రెడ్డి,బిఆర్ఎస్ మండల కన్వీనర్ యిడం కైలాసం,మండల పరిషత్ సీనియర్ అసిస్టెంట్ తాటి శ్రీనివాస్,పంచాయతీ కార్యదర్శి షఫీ,ఉప సర్పంచ్ ఖమ్మం లక్ష్మయ్య,బొట్ట శివ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply