బాధితులకు ధైర్యం చెప్పిన జగన్
బోటు ప్రమాద బాధితులను పరామర్శించిన వైఎస్ జగన్.. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు భరోసా
విశాఖపట్నం, ఆంధ్రప్రభ : బోటు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కుటుంబాలను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శించారు. ప్రమాద ఘటనపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకుని బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.
ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ చిన్నాను ప్రత్యేకంగా పరామర్శించిన వైఎస్ జగన్, ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం జరుగుతున్న చర్యలపై కూడా వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మత్స్యకారులు తమకు ఎదురైన ఇబ్బందులు, కుటుంబాలు ఎదుర్కొంటున్న పరిస్థితులను వైఎస్ జగన్‌కు వివరించారు. వారి సమస్యలను ఓపికగా విన్న ఆయన, బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గల్లంతైన మత్స్యకారుల క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ ఓదార్చారు.
