విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి –ఏఐటీయూసీ

విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి –ఏఐటీయూసీ

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులపై ఏస్మా, డిస్మిస్ ఈ చర్యలు తీసుకోకుండా చర్చలతో వారి సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఓమా బిక్షపతి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు ఓమా బిక్షపతి, సీపీఐ మండల కార్యదర్శి బందు మహేందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్ విద్యుత్ సంస్థల్లో 18000 మంది ఆర్టిజన్ కార్మికులు పని చేస్తున్నారని, సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్టిజన్ విధానం వల్ల కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా చర్చలతో సమస్యలను పరిష్కరించి సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం విరమింపజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల సహాయ కార్యదర్శి గణపురం లక్ష్మణ్, పేరబోయిన కిరణ్ కుమార్, పట్టణ కార్యదర్శి ముదరబోయిన వెంకన్న, నాయకులు సూరబోయిన వీరన్న, చంద్రయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply