ఏఐఏపీడీఎస్ నేత నాగార్జున అరెస్ట్.. అనంతరం విడుదల

వడ్డేపల్లి, ఆంధ్రప్రభ : వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న చలో సచివాలయం కార్యక్రమం నేపథ్యంలో ఏఐఏపీడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జునను సోమవారం అర్ధరాత్రి సుబేధారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ సుమన్ నేతృత్వంలో నాగార్జునను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, ఎన్ని అరెస్టులు చేసినా తమ ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వం హరిస్తోందని ఆయన ఆరోపించారు.