Kavita Warns | బిసిల‌కు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే.. లేకుంటే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను అడ్డుకుంటాం

కామారెడ్డి : బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటామని జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. బీసీ బిల్లు సాధనకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని రేవంత్ ను కోరారు. బీసీ బిల్లు ఆమోదం కోసం ఒత్తిడి తెచ్చేందుకు జులై 17వ తేదీన రైల్‌రోకో చేపడతామని ప్రకటించారు. మెదక్ జిల్లాలో కామారెడ్డిలో నేడు జ‌రిగిన రౌండ్ టేబుల్ సమావేశం కవిత మాట్లాడుతూ, . ఇది రాజకీయ వేదిక కాద‌ని .. మానవ హక్కుల వేదిక అని చెప్పారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు సాధించుకుంటామని తెలంగాణ తెలిపారు. బీసీలంతా చైతన్యం కావాలని కోరారు. కామారెడ్డి‌లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎన్నికల సమయంలో ప్రకటించిన డిక్లరేషన్ సాధించే వరకు త‌మ పోరాటం కొన‌సాగుతుంద‌ని అన్నారు.. విద్యకు, ఉద్యోగాలకు, రాజకీయాలకు వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ బిల్లులు పెట్టాలని కోరారు. ఢిల్లీకి బిల్లు పంపామని తమకు సంబంధం లేదనేలా కాంగ్రెస్ నేతలు అంటున్నారని తెలిపారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒక్కరోజైనా బీసీ బిల్లు గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో మాట్లాడారా అని ప్రశ్నించారు. బీసీ బిల్లు వస్తే ఉద్యోగాలు, రాజకీయ అవకాశాలు, నిధులు వస్తాయని అన్నారు.

Leave a Reply