4th place | ఇవాళ రాజ‌స్థాన్‌తో ఢీ

4th place | ఇవాళ రాజ‌స్థాన్‌తో ఢీ

జైపూర్‌లోని స‌వాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో మ్యాచ్‌
రాత్రి 7.30గంట‌ల‌కు ప్రారంభం

4th place | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఇవాళ బిగ్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ హోరాహోరీగా త‌ల‌ప‌డేందుకు సిద్ధ‌మ‌య్యాయి. జైపూర్‌లోని స‌వాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాత్రి 7.30 గంట‌ల‌కు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌ లైవ్‌లు స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. ఢిల్లీ జ‌ట్టుకు ఈ మ్యాచ్ చావోరేవో అని చెప్ప‌వ‌చ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి దారుణంగా ఉంది. ఢిల్లీ ఈ సీజ‌న్‌లో ఎనిమిది మ్యాచులు ఆడి కేవ‌లం 3 మ్యాచుల్లో మాత్ర‌మే విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం టేబుల్ ఏడో ప్లేస్‌లో ఉంది. ప్లేఆఫ్స్ రేస్‌లో నిల‌వాలంటే ఢిల్లీ త‌ప్ప‌నిస‌రిగా గెల‌వాలి. లేదంటే ఇంటి బాట ప‌ట్ట‌క త‌ప్ప‌దు.

రాజస్థాన్ ఫుల్ జోష్‌లో ఉంది. ఈ జ‌ట్టు పటిష్టమైన స్థితిలో ఉంది. ఈ జ‌ట్టు 9 మ్యాచులు ఆడ‌గా 6 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో 4వ స్థానంలో ఉంది. ఈ రోజు జ‌రిగే మ్యాచ్ సొంత గడ్డపై ఆడుతుండటం రాజస్థాన్‌కు కలిసొచ్చే అంశమ‌ని చెప్ప‌వ‌చ్చు. దీంతో ఢిల్లీ విజ‌యం సాధించాలంటే చెమ‌టోడ్చ‌క త‌ప్ప‌దు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు మ‌ధ్య మొత్తం 30 మ్యాచులు జ‌రిగాయి. ఇరు జట్లు తలో 15 విజయాలతో సమానంగా ఉన్నాయి. ఈ రికార్డును చూస్తే నేడు జ‌రిగే పోరులో హోరాహోరీ త‌ప్ప‌ద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Leave a Reply