TDP | సభ్యత్వంతో భరోసా..
తెదేపా సభ్యత్వంతో కార్యకర్త కుటుంబానికి లభించిన భరోసా
రూ.5 లక్షల చెక్కు ను అందజేసిన ఎమ్మెల్యే వేగేశన
TDP | బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన కర్లపాలెం మండలం తుమ్మలపల్లి టీడీపీ కార్యకర్త కోమట్ల దుర్గా రెడ్డి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ భీమా రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు (Vegesana Narendra Varma Raju) అందజేశారు. శనివారం బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు నివాసం వద్ద సభ్యత్వ బీమా ఆర్థిక సహాయం బాధ్యత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే (MLA) మాట్లాడుతూ దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు ఖర్చుచేసిన ఘన చరిత్ర తెలుగుదేశం పార్టీ దాని అన్నారు. పార్టీకి కార్యకర్తలే బలం బలగం అని చెప్పారు. పసుపు సైన్యం సంక్షేమం కోసం వందల కోట్లు వేచించిన తెలుగుదేశం పార్టీ రూ.100 లతో టిడిపి సభ్యత్వం తీసుకున్న వారికి రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించిందని చెప్పారు. కార్యకర్తలను, వారి కుటుంబ సభ్యుల సంక్షేమం చూసే ఏకైక రాజకీయ పార్టీ తెలుగుదేశం అని అన్నారు. కర్లపాలెం టిడిపి పార్టీ మండల అధ్యక్షులు ఏపూరి భూపతిరావు, గ్రామ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.

