Varni | నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన అబ్జర్వర్
Varni | వర్ని, ఆంధ్రప్రభ : వర్ని (Varni) మండలం సత్యనారాయణపురం గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని ఎన్నికల జిల్లా అబ్జర్వర్ శ్యాం ప్రసాద్ లాల్ (Shyam Prasad Lal) పరిశీలించారు. శనివారం నామినేషన్ల ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులతో చర్చించారు. నామినేషన్ వేస్తున్న అభ్యర్థులతో మాట్లాడారు. ఆయన వెంట తహసీల్దార్ సాయిలు, ఎంపీడీవో వెంకటేశం, తదితరులున్నారు.

