Asifabad | ప్రతి ఒక్కరికి స్వాతంత్ర ఫ‌లాలు అందాలి…

Asifabad | ప్రతి ఒక్కరికి స్వాతంత్ర ఫ‌లాలు అందాలి…

Asifabad | జైనూర్, ఆంధ్రప్రభ : సమాజంలోని అణగారిన వర్గాల ఆశాజ్యోతి స్వాతంత్ర సమరయోధులు క్రాంతి వీర్ లావుజీ సాల్వే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు(Kudmetha Vishwanath Rao) అన్నారు.

ఈరోజు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని గణేష్ నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సాహిత్య సామ్రాట్ క్రాంతి వీర్ లావుజీ సాల్వే 231 వ జయంతి కార్యక్రమాన్ని అన్నా బౌసాట్టే కొమరం భీమ్‌ జిల్లా అధ్యక్షుడు మావాలే దత్త ఆధ్వర్యంలో మాంగ్ సమాజ్ నాయకులు నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా లావుజీ సాల్వే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ విశ్వనాత్ రావు మాట్లాడుతూ.. మహనీయుల అడుగుజాడల్లో యువత పయనించాల్సిన అవసరముందన్నారు. స్వాతంత్ర సమర యోధుల స్పూర్తి తో కాంగ్రెస్ పార్టీ జై భీం, జై సంవిధాన్, జై బాపు నినాదంతో ప్రతి ఒక్కరికి స్వాతంత్ర పలాలు అందాలని కృషి చేస్తుందని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ హన్నుపటెల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అబ్దుల్ ముఖీద్, నాయకులు మెస్రం అంబాజీ రావు, పెందుర్ ప్రకాష్, కోట్నాక్ దౌలత్ రావు, దళిత సంఘాల రాష్ట్ర, జిల్లా నాయకులు కాంబ్లే బాబా సాహెబ్, కాంబ్లే బాలాజీ, గైక్వాడ్ దత్తరాజ్, మావాలే దత్త, పుల్లరే విజయ్ కుమార్, భారత్, శ్రీహరి, సోపాన్ ,కాంబ్లే అన్నా రావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply