KNR | ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్య..

పాలకుర్తి, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో చోటుచేసుకుంది.

మంగళవారం విడుదలైన ఫలితాల్లో జీడీ నగర్‌కు చెందిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న తపల్ల శశిరేఖ (17) ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపం చెందిన శశిరేఖ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

విద్యార్థిని శశిరేఖ క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘ‌ట‌న‌పై బసంత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply