Criminals|పాతనేరగాళ్ల పట్టివేత
18 చోరీ కేసుల్లో ఇద్దరు అరెస్టు
రూ. 33.25 లక్షల సొత్తు స్వాధీనం
జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి
Criminals| శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : శ్రీకాకుళం రూరల్, 1 టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత కొన్నాళ్లుగా రాత్రి వేళల్లో ఇళ్లల్లో దొంగతనం కేసుల పై జిల్లా పోలీసులు ప్రత్యే క క్రైమ్ బృందాలు 18 కేసులను ఛేదించాయి. దున్న కృష్ణ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్టు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో అయన కేసు వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళం మండలంలో 14 కేసులు, శ్రీకాకుళం 2 టౌన్ లో 3 కేసులు, శ్రీకాకుళం 1 టౌన్ లో ఒక చోరీ కేసులో దున్న కృష్ణ ను అరెస్టు చేసి రూ. 33,25,539 ల బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
