నిత్య అన్నదాన పథకానికి రూ.1,01,116 విరాళం
నిత్య అన్నదాన పథకానికి రూ.1,01,116 విరాళం
ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ)కి చెక్కు అందించిన దాతలు
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కదుర్గమ్మ అమ్మవారి నిత్య అన్నదాన విభాగానికి భక్తులు మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. పటమటలంకకు చెందిన తోట మల్లికార్జునరావు–మల్లేశ్వరి దంపతులు అమ్మవారిపై ఉన్న అపార భక్తిశ్రద్ధలతో రూ.1,01,116 విరాళాన్ని సమర్పించారు.
ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో దాతలు తమ విరాళాన్ని ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ)కు అందజేశారు. ఆలయ అధికారులు దాతకు అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయక వేద ఆశీర్వచనం అనంతరం దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు రసీదును అందజేశారు.
