AP NEET Development | నాణ్యత, శుభ్రత పాటించాలి

AP NEET Development | నాణ్యత, శుభ్రత పాటించాలి
- ఏపీ నీట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చంద్రదండు ప్రకాష్ నాయుడు
- మాంసాహార దుకాణాలపై మెరుపు దాడి
AP NEET Development | బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : బాపట్ల పట్టణంలోని మాంసాహార దుకాణాలపై ఏపీ నీట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చంద్రదండు ప్రకాష్ నాయుడు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా పశువర్ధక శాఖ అధికారి డాక్టర్ వేణుగోపాలరావు, బాపట్ల పురపాలక సంఘం శానిటరీ ఇన్ స్పెక్టర్‌లు కరుణ, నజీర్, ఫుడ్ కమిషనర్ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ రోజు మాంసాహార విక్రయ దుకాణాల్లో నాణ్యతను పరిశీలించారు. అపరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలు పాటించని దుకాణదారులకు రూ.5000 జరిమానా విధించారు.

ఈ సందర్భంగా చైర్మన్ ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహించినట్లు తెలియజేశారు. రానున్న రోజుల్లో దాడులు విస్తృతంగా నిర్వహిస్తామని చెప్పారు. దుకాణ యజమానులు తప్పక నాణ్యత, శుభ్రత పాటించాలని హెచ్చరించారు.
