కండ్రికలో ప్రజల దాహార్తిని తీర్చుతున్న చలివేంద్రం.
కండ్రికలో ప్రజల దాహార్తిని తీర్చుతున్న చలివేంద్రం.
పాయకాపురం, ఆంధ్ర ప్రభ : నగర శివారు ప్రాంతమైన కండ్రికలో టీడీపీ కార్యాలయంలో ప్రజల దాహార్తిని తీర్చుతున్న చలివేంద్రం పాదాచారుల మన్నలను పొందుతున్నది.స్థానిక64వ డివిజన్ అధ్యక్షుడు కాకొల్లు రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ఆదివారం వేసవి తాపాన్ని చల్లార్చుకొనేందుకు ప్రజలు చలివేంద్రంబాట పట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్ పాల్గొని 8వ రోజు పాదాచారులకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు డివిజన్ టీడీపీ కార్యాలయంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు.దీని ద్వారా వాహనదారులు, పాదాచారులు,ఇతర రాష్ట్రాల ప్రయాణికులు సుమారు రెండువేల మంది తమ దాహార్తిని తీర్చుకొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి తెలుగు యువత నాయకులు కాకోల్లు సాయి హర్ష,సెక్రటరీ బాబు , యూనిట్ ఇన్చార్జి కోమరి రాజేష్,కంకణాల బాబు,కుప్పిలి రమణ, పొట్నూరి అప్పలనాయుడు,నల్లిపొగు కన్నా,దీవెన వంశీ, రెడ్డి సందీప్, నెలపాటి రాకేష్ ,పొదిలపు శ్రీనివాస్ రావు , వెళ్లంకి అజయ్ పాల్గొన్నారు.
