AP | పేదవారి కోసం..

AP | పేదవారి కోసం..

AP, ఆకివీడు, ఆంధ్రప్రభ : ఏలూరు (Eluru) జిల్లా తాడినాడ గ్రామంలో ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పటల్ భీమవరం వారి ఆధ్వర్యంలో నంబూరు వెంకటరామరాజు నిర్వహణలో ఆదివారం మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. హాస్పటల్ చైర్మన్ భాస్కర్ రాజుకు వెంకట్రామరాజు గ్రామస్తులతో కలిసి ఆహ్వానం పలికారు. పెన్మెత్స సూర్య సౌమిత్, పెన్మెత్స కృష్ణ చైతన్య, కంటి వైద్యులు గ్రామస్తులకు పరీక్షలు చేసి, కళ్ళజోళ్ళు అందజేశారు. ఉచిత మెగా శిబిరంలో భారీగా వృద్ధులు, మహిళలు పాల్గొన్నారు.

వైద్య శిబిరంలో మరి కొంత మంది వైద్యులు బీపీ, షుగర్ వంటి వ్యాధుల కూడా ఉచితంగా మందులు అందజేశారు. చైర్మన్ భాస్కర్ రాజు మాట్లాడుతూ.. పేదవారికి వైద్యం అందించడం ఉచిత శిబిరం ముఖ్య ఉద్దేశమని, గ్రామస్తులందరూ ఉచిత శిబిరంలో పాల్గొని సేవలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాదిరాజు రమేష్ రాజు, తాడి శ్రీనివాసరావు, కొత్తపల్లి బంగార్రాజు, పెన్మెత్స రామరాజు, గాదిరాజు సత్తిపండు రాజు, కంతేటి రామరాజు తదితరులు పాల్గొన్నారు.