శాకంబరిగా అమ్మవారి దివ్య దర్శనం!
కూరగాయలతో అద్భుత అలంకరణ..!
భక్తులను కట్టిపడేసిన శాకంబరి అమ్మవారు
ఆషాఢ ప్రత్యేకం.. అమ్మవారి విశేష అలంకరణ
చూడగానే భక్తి పారవశ్యం కలిగించే అలంకారం!
శివనగర్ ఆలయంలో శాకంబరి వైభవం
కరీమాబాద్, ఆంధ్రప్రభ: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని 35వ డివిజన్ శివనగర్‌లోని శ్రీ శివ విఘ్నేశ్వరాలయంలో పార్వతి అమ్మవారికి శాకంబరి అలంకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
మంగళవారం ఉదయం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో, ఆలయ అర్చకులు విశ్వేశ్వరరావు నేతృత్వంలో శ్రీ పార్వతి దేవిని పలు రకాల కూరగాయలతో శాకంబరిగా ప్రత్యేకంగా అలంకరించారు.
భక్తులు తీసుకొచ్చిన కూరగాయలతో అమ్మవారికి విశేష అలంకరణ నిర్వహించగా, ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. 34వ, 35వ, 36వ డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు శాకంబరి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కటాక్షానికి పాత్రులయ్యారు.
