AP | అసెంబ్లీకి విద్యార్థి..

AP | అసెంబ్లీకి విద్యార్థి..

AP, నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం అమరావతిలోని (Amaravati) అసెంబ్లీ ప్రాంగణం వద్ద రాష్ట్రంలోని కొంత మంది విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. 175 నియోజకవర్గాల నుంచి విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి నంద్యాల జిల్లా డోన్ కు చెందిన డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థిని సూసన్న మాక్ అసెంబ్లీకి ఎంపికయ్యారు. ఈనెల 26వ తేదీన అమరావతి అసెంబ్లీలో ఈ బాలిక అడుగుపెట్టనుంది. మాక్ అసెంబ్లీకి ఎంపిక కావడంతో వారి కుటుంబ సభ్యులు టీచర్లు విద్యార్థినీ, విద్యార్థులు అభినందించారు. బైపీసీ చదివిన విద్యార్థులకు ఉపయోగపడేలా.. నీట్ కాలేజ్ మన జిల్లాలో ఏర్పాటు చేయడం గురించి అసెంబ్లీలో మాట్లాడుతానని విద్యార్థిని సూసన్న పేర్కొన్నారు.

రాజ్యాంగం ఆమోదం పొంది 76 ఏళ్లు అయిన సందర్భంగా.. అసెంబ్లీ తరహాలోనే మాక్‌ అసెంబ్లీ నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. రేపు 26న జరిగే మాక్‌ అసెంబ్లీలో ముందుగా ప్రొటెం స్పీకర్‌ ఎన్నిక చేస్తారు. ఆ తర్వాత స్పీకర్‌ ఎన్నిక, తర్వాత మాక్‌ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి అన్నారు. అసెంబ్లీ పై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఉప సభాపతి రఘురామ కృష్ణంరాజు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, (Chandra Babu Naidu) ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు.