విజ్ఞాన్ విహార్ పాఠశాలలో సదుపాయాల లేమి..
విజ్ఞాన్ విహార్ పాఠశాలలో సదుపాయాల లేమి..
ఎంఈఓ విచారణపై తల్లిదండ్రుల ఆరోపణలు
ఏలూరు ఎడ్యుకేషన్, ఆంధ్రప్రభ :ఏలూరు ఒకటో పట్టణ ప్రాంతంలో ఉన్న విజ్ఞాన్ విహార్ ప్రైవేట్ పాఠశాలలో కనీస సదుపాయాలు లేవంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మంగళవారం విజ్ఞాన విహార పాఠశాలకు విచారణకు వెళ్లిన మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) యాజమాన్యానికి అనుకూలంగా విచారణ జరిపి అన్ని సదుపాయాలు ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చారని అవి వాస్తవాలకు విరుద్ధమని సమాచారం.
రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ప్రకారం తప్పనిసరి అయిన ఆటస్థలం పాఠశాలకు లేదని, ఉన్నా విద్యార్థుల సంఖ్యకు సరిపోవడం లేదని తల్లిదండ్రులు విమర్శలు కనబడుతున్నాయి.
ల్యాబ్, లైబ్రరీ, సురక్షిత తాగునీరు వంటి మరికొన్ని కనీస సదుపాయాలు లేకపోయినా, విచారణ సందర్భంగా అన్నీ ఉన్నట్లు విచారణకు వెళ్లిన ఎంఈఓ చూపించారని ఆరోపణ.
పాఠశాల ఏ తరగతి నుండి ఏ తరగతి వరకు నిర్వహిస్తోందో తెలిపే డిస్‌ప్లే బోర్డు కూడా ఏర్పాటు చేయకుండా యాజమాన్యం ఇష్టానుసారం నడుస్తోందని ఆంధ్రప్రభ ప్రతినిధి వివరణ అడిగిన నేపథ్యంలో
నిబంధనల ప్రకారం లేని సదుపాయాలను ఉన్నట్లు చూపించి ఎంఈఓ వెనకేసుకొచ్చారు.
ఎంఈఓ వివరణ.
ఆరోపణల పై ఎంఈఓ స్పందిస్తూ పాఠశాలకు అనుకూలంగా స్పందించి విజ్ఞాన విహార పాఠశాలకు వెళ్లి విచారణ నిర్వహించాను. నిబంధనల ప్రకారం కనిపించిన వివరాలతో నివేదిక తయారు చేసి డీఈవో కార్యాలయానికి పంపాను. ఉన్నతాధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు అని తెలిపారు.
